క‌త్తి మ‌హేష్ ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ ఎకౌంట్స్ బ్లాక్‌

Wed,April 25, 2018 08:14 AM
kathi mahesh accounts blocked

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా , క్రిటిక్‌గా సినిమా ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచ‌త‌మైన క‌త్తి మ‌హేష్ బిగ్ బాస్ షోతో అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు. ఆ త‌ర్వాత అదే ప‌నిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు ఎక్కు పెడుతూ అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు. ప‌వ‌న్‌నే టార్గెట్ చేస్తూ క‌త్తి చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా అదే రీతిలో స్పందించారు. అయితే మ‌ధ్య‌లో కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న క‌త్తి మ‌హేష్ మ‌ళ్ళీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు క‌త్తి ఎక్కు పెట్టారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్‌గా అన్న‌పూర్ణ స్టూడియోలో మా అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశానికి క‌త్తి మ‌హేష్ హాజ‌రు కావాల‌ని భావించిన‌, ఆయ‌న‌ని లోప‌ల‌కి వెళ్ళ‌నివ్వ‌కుండా వెన‌క్కి పంపించేశారు ప‌వ‌న్ అభిమానులు.

కొద్ది రోజులుగా సినీ విమర్శకుడు కత్తి మహేష్ డిబేట్స్‌లోనే కాకుండా ట్విట్ట‌ర్‌,ఫేస్ బుక్ ఎకౌంట్స్‌లోను ప‌వ‌న్‌ని విమ‌ర్శిస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ అభిమానులు త‌న ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్ ఎకౌంట్స్‌ని బ్లాక్ చేయించార‌ని మ‌హేష్ ఆరోపిస్తున్నాడు. ఓ వీడియోలో క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ .. ‘పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొన్ని లక్షల మంది నా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌పై రిపోర్టు చేయడం వల్ల అవి బ్లాకయ్యాయి. ఈ ట్వీటమరాయుడి ట్వీట్లకు స్పందించినా.. సిగ్గుతో తలంచుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఏం ట్వీటమరాయుడో, ఏం కాటమరాయుడో, ఏం పవర్ స్టార్ పవన్ కళ్యాణో నాకు అర్థం కావడం లేదు. ఇంత భయమైతే ఎలాగయ్య నీకు. కనీసం ఎదుటివాడు నీకు వ్యతిరేకంగా భావ వ్యక్తికరణ చేస్తేనే. నీ అభిప్రాయం వ్యతిరేకంగా చేస్తే భరించలేని ఫ్యాన్స్, ఎదుర్కోలేని నువ్వు, చీ అనిపిస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ లేకపోయినా నా మాటలు ఆగవు. నా నోరు మూతపడదు’’ అని అన్నారు. గ‌తంలోను బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆయ‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్ బ్లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

6047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles