మ‌రో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు అన‌సూయ‌

Fri,October 19, 2018 10:06 AM
Kathanam Movie Official Motion Poster

బుల్లితెర‌పైనే కాదు వెండితెర‌పై రాణిస్తున్న అన‌సూయ తాజాగా క‌థ‌నం అనే చిత్రం చేస్తుంది. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నాగార్జున మరదలు పాత్రలో మెప్పించిన అనసూయ.. ‘క్షణం’లో ఏసీపీ జయగా పవర్‌ఫుల్‌గా నటించింది. ఈ ఏడాది వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడు ఓ పవర్‌ఫుల్ పాత్రలో న‌టించేందుకు సిద్ధ‌మైంది. క‌థ‌నం అనే టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా , ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో గాయత్రి ఫిలింస్ బ్యానర్‌పై బట్టిపాటి నరేంద్రరెడ్డి, సర్మా చుక్క నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు. రీసెంట్‌గా అన‌సూయ ఫ‌స్ట్ లుక్ తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అన‌సూయ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో అన‌సూయ‌ జర్నలిస్టు లేదా రచయితగా కనిపించనున్న‌ట్టు స‌మాచారం.

2570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles