'క‌థ మొద‌ల‌వ‌కే' అనే మెలోడి సాంగ్‌తో అల‌రిస్తున్న త‌మ‌న్నా

Wed,February 6, 2019 08:20 AM

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ క్వీన్ రీమేక్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అతి త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తెలుగులో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ అనే టైటిల్‌తో రూపొందిన క్వీన్ రీమేక్ చిత్రాన్ని ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా క‌థ మొద‌ల‌వ‌కే అనే మెలోడి సాంగ్ విడుద‌ల చేశారు. అమిత్ త్రివేది సంగీతంలో రూపొందిన ఈ సాంగ్‌కి కృష్ణ కాంత్ సంగీతం అందించారు. శ్రేయాగోష‌ల్‌, స‌త్య ప్ర‌కాశ్ ఆల‌పించారు. క్వీన్ చిత్రం సౌత్‌లోని వేరే భాష‌ల‌లోను రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. హిందీలో కంగ‌న ర‌నౌత్ పాత్ర‌ని త‌మిళంలో కాజ‌ల్‌, మ‌ల‌యాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్ అనే టైటిల్స్ తో రూపొందుంది.



1299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles