'మ‌హాల‌క్ష్మీ' క‌థ మొద‌ల‌వ‌కే సాంగ్.. మేకింగ్ మీడియో

Fri,February 15, 2019 08:05 AM
Katha Modalavake  Making  video

బాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్రం క్వీన్ తెలుగులో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ అనే టైటిల్‌తో రూపొందిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల క‌థ మొద‌ల‌వ‌కే అనే మెలోడి సాంగ్ విడుద‌ల చేశారు. అమిత్ త్రివేది సంగీతంలో రూపొందిన ఈ సాంగ్‌కి కృష్ణ కాంత్ సంగీతం అందించారు. శ్రేయాగోష‌ల్‌, స‌త్య ప్ర‌కాశ్ ఆల‌పించారు. ఈ సాంగ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌గా, తాజాగా మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో త‌మ‌న్నా షూటింగ్ లొకేష‌న్ ఎక్స్‌పీరియెన్స్‌ని షేర్ చేసుకుంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని యూనిట్ చెబుతుంది. క్వీన్ చిత్రం సౌత్‌లోని వేరే భాష‌ల‌లోను రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. హిందీలో కంగ‌న ర‌నౌత్ పాత్ర‌ని త‌మిళంలో కాజ‌ల్‌, మ‌ల‌యాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్ అనే టైటిల్స్ తో రూపొందుంది.


863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles