నాగ్ ఫోటోపై 'ఏమ్‌ ఉన్నాడ్రా బాబు' అనే కామెంట్‌

Fri,September 28, 2018 10:36 AM
kartikeya shocking comments on nag

అమ్మాయి క‌ల‌ల రాకుమారాడు నాగార్జున 59 ఏళ్ల వ‌య‌స్సులోను కుర్రాడిలా క‌నిపిస్తూ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఆయ‌న న‌టించిన దేవదాస్ చిత్రం రీసెంట్‌గా విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటుంది. చిత్రంలో చాలా స్టెలిష్‌గా అతడి పాత్ర సాగుతుంది. తనదైన శైలి నటనతో దేవ పాత్రకు ప్రాణంపోశారు నాగ్‌. అయితే దేవ‌దాస్ సినిమా చూసిన ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ చిత్రంలో ఆయ‌న లుక్‌కి ఫిదా అయి ట్వీట్ చేశాడు. వికీపీడియా త‌ప్పు చూపిస్తోందా ? ఎందుకంటే అందులో ఈ మనిషికి 59 సంవత్సరాలని ఉంది. నాగార్జున గారు ఆయ‌న ఫిట్ నెస్ తో 20 ఏళ్ళ వ‌య‌స్సున్న హీరోల‌కి ఛాలెంజ్ విసురుతున్నారు. ఏమ్ ఉన్నాడ్రా బాబు అంటూ దేవదాస్‌లోని నాగ్‌ పిక్‌ను పోస్ట్‌చేశాడు. కార్తికేయ‌. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అయింది. ఆర్‌ఎక్స్‌ 100తో విజయం సాధించిన కార్తికేయ.. తదుపరి చిత్రంగా ‘హిప్పీ’ని పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవ‌ల ఆయ‌న బర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో కార్తికేయ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది.



2099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles