త‌ప్పుడు వార్త‌లు ఆపండంటున్న ఆర్ఎక్స్ 100 హీరో

Tue,September 4, 2018 01:25 PM
Kartikeya Gummakonda clarifies about supari

అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ‌, పాయ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం ఆర్ఎక్స్ 100. అడ‌ల్ట్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌బించాయి. ద‌ర్శ‌కుడు, హీరో హీరోయిన్స్ ఓవ‌ర్‌నైట్ స్టార్స్ అయ్యారు. ఈ ముగ్గురికి పెద్ద బేనర్స్ నుండి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అయితే ఆర్ఎక్స్ చిత్రంలో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న‌ కార్తికేయ సుపారీ సినిమాలో న‌టించ‌నున్న‌ట్టు కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై కార్తికేయ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. సుపారీలో నేను న‌టిస్తున్నాను అనేది అవాస్త‌వం. సినిమా స్టార్ట్ చేసేముందు డెమో రీల్ అని షూట్ చేసాం. షూటింగ్ త్వరలో స్టార్‌ చేస్తామన్నారు కానీ చేయలేదు. కాని ఇప్పుడు ఆ వీడియోని అందులో వాడుకున్నారు. నేను సుపారి సినిమాలో నటించలేదు . ద‌య‌చేసి త‌ప్పుడు వార్త‌ల‌ని ఇక‌నైన ఆపండి అంటూ కార్తికేయ ట్వీట్ చేశారు. కార్తికేయ క‌బాలి వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ని నిర్మించిన క‌లైపులి ఎస్ థాను నిర్మాణంలో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. . ఈ సినిమాకు ఎన్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా బైలింగ్యువ‌ల్ మూవీగా తెలుగు, త‌మిళంలో రూపొందిస్తారా లేక త‌మిళంలోనే తెర‌కెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.


5101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles