నిఖిల్ 'కార్తికేయ' రిటర్న్స్‌

Sat,June 1, 2019 07:18 AM
karthikeya returns

నిఖిల్, స్వాతి కాంబినేష‌న్‌లో చందూ మొండేటి తెర‌కెక్కించిన చిత్రం కార్తికేయ‌. థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఆ విష‌యాన్ని క‌న్‌ఫాం చేశారు మేక‌ర్స్‌. నిఖిల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చందూ మొండేటి కార్తికేయ 2 చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఉత్కంఠ భరితంగా సాగే కథ, కథనాలతో దర్శకుడు చందు మొండేటి మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కార్తికేయ2 చిత్రం కార్తికేయ క‌న్నా భారీ స్థాయిలో ఉంటుంద‌ని అంటున్నారు. కార్తికేయలో హీరోయిన్ గా నటించి అల‌రించిన కలర్స్ స్వాతి కార్తికేయ 2లోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. పెళ్ళి త‌ర్వాత ఈ చిత్రం స్వాతికి రీ ఎంట్రీ అవుతుంది. మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర‌బృందం తెలిపింది.

1805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles