నేటి నుండి మొద‌లు కానున్న కార్తి, జ్యోతిక డ్రామా

Sat,April 27, 2019 12:20 PM
Karthi new film poster released

కొద్ది రోజుల క్రితం కార్తి, జ్యోతిక కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. సూర్య‌, కార్తి కాంబినేష‌న్‌లో సినిమా చూడాల‌ని అనుకుంటున్న ఫ్యాన్స్‌కి ఇది కొంత ఊర‌ట‌నిచ్చింది. అయితే తాజాగా కార్తి, జ్యోతిక‌, స‌త్య‌రాజ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.జ్యోతిక‌తో పాప‌నాశం తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. చిత్రానికి సంబంధించిన విడుద‌లైన పోస్టర్‌లో కార్తీని స‌రికొత్త‌గా చూపించారు. ఆన్స‌న్ పాల్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. గోవింద్ వ‌సంత్ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. స‌రికొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో కార్తీ.. జ్యోతిక సోదరుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. కాగా, కార్తీ.. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ చిత్రం చేస్తున్నాడు . ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకి చేరుకుంది. 'రెమో' ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ద‌ర్శక‌త్వంలోను కార్తీ ఓ సినిమా చేయ‌నున్నాడు

1310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles