నిన్న చిరు టైటిల్‌, నేడు ప‌వ‌న్ టైటిల్‌పై క‌న్నేసిన కార్తీ

Tue,November 12, 2019 10:20 AM

త‌మిళ హీరో కార్తీ మంచి హిట్స్‌తో దూసుకెళుతున్నాడు. రీసెంట్‌గా ఖైదీ అనే చిత్రం కార్తీకి మంచి స‌క్సెస్ అందించింది. చిత్రానికి క్రిటిక్స్, ఆడియ‌న్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ మూవీ వ‌సూళ్ళు కూడా భారీగానే రాబ‌ట్టింది. అయితే మెగాస్టార్ తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఖైదీ పేరుతో త‌న సినిమాని విడుద‌ల చేసిన కార్తీ ఈ సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ పేరుని వాడుకోవాల‌ని చూస్తున్నాడ‌ట‌. తంబీ అనే త‌మిళ చిత్రంలో కార్తీ న‌టించ‌గా ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్ లేదా, న్యూ ఇయ‌ర్ కానుకగా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ మూవీని తెలుగులో డ‌బ్ చేసి త‌మ్ముడు పేరుతో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. త‌మ్ముడు చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌గా ,ఈ మూవీ 1990లో విడుద‌లైంది. ఈ చిత్రం ప‌వ‌న్‌కి మంచి స్టార్ డం తెచ్చిపెట్టిన విష‌యం తెలిసిందే.

1930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles