చిన్నా ఇంకా నా కళ్లల్లోనే ఉన్నాడు..‘దొంగ’ ట్రైలర్

Tue,December 10, 2019 06:10 PM

కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తోన్న తాజా చిత్రం 'దొంగ'. జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘చిన్నా ఇంకా నా కళ్లల్లోనే ఉన్నాడు..నాకిక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే’ అంటూ జ్యోతిక చెప్పే సంభాషణలతో ప్రారంభమయ్యే ట్రైలర్ సస్పెన్స్ గా ఉంది. కార్తీ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ కూడా కనిపిస్తోంది.


ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన జ్యోతిక, సత్యరాజ్‌ మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles