కార్తీ ‘దేవ్’ టైటిల్ పోస్టర్ విడుదల

Thu,October 25, 2018 09:49 PM
KARTHI DEV MOVIE TITLE POSTER REVEALED

హైదరాబాద్‌: చినబాబు తర్వాత కోలీవుడ్ యాక్టర్ కార్తి నటిస్తోన్న తాజా చిత్రం ‘దేవ్’. రజత్‌ రవి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను కార్తీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. చేతిలో హెల్మెట్‌ పట్టుకుని స్పోర్ట్స్‌ బైక్‌ వద్ద కార్తి నిలబడిన పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. తన అభిమాన క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ స్ఫూర్తితోనే ఈ సినిమాకు ‘దేవ్‌’ టైటిల్‌ను ఖరారు చేసినట్లు దర్శకుడు రజత్‌ రవి శంకర్‌ చెప్పాడు. ఖాకీ చిత్రం తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, నిక్కీ గల్రానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేరిస్‌ జయ్‌రాజ్‌ సంగీత దర్శకుడు. డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

1671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles