తెలుగు ద‌ర్శ‌కుడితో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కార్తీ..!

Sat,April 14, 2018 12:17 PM
Karthi clarity on Venu Udugula movie

యంగ్ హీరో కార్తీ త‌మిళంలో విభిన్న క‌థా చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ఈ హీరో సినిమాలు తెలుగులోను విడుద‌లై మంచి వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. కార్తీ న‌టించిన రీసెంట్ చిత్రం ఖాకీ త‌మిళంలోనే కాక తెలుగులోను మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఇన్నాళ్ళు అనువాద చిత్రాల‌ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన కార్తీ కొత్త ద‌ర్శ‌కుడితో క‌లిసి ఓ డైరెక్ట్ మూవీ చేయాల‌ని అనుకుంటున్నాడంటూ ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. చిన్న చిత్రంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన నీది నాది ఒకే క‌థ చిత్రం డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల రీసెంట్‌గా కార్తీని క‌లిసి స్టోరీ లైన్ వినిపించాడ‌ని అన్నారు. దీనికి ఇంప్రెస్ అయిన కార్తీ క‌థ మొత్తం సిద్ధం చేశాక మ‌రోసారి క‌లుద్ధామ‌ని చెప్పాడంటూ ప్ర‌చారం కూడా జ‌రిగింది. దీనిపై స్పందించిన కార్తీ త‌న ద‌గ్గ‌రికి ఎవ‌రురాలేద‌ని, ఆధారం లేని వార్త‌ల‌ని అస్స‌లు న‌మ్మోద్ద‌ని చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై క‌డైకుట్టి సింగం అనే చిత్రం చేస్తున్నారు. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయేషా సైగ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ మూవీ త‌ర్వాత రజత్‌ దర్శకత్వంలో తన 17వ చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ నాయకిగా నటింనున్నారు. నటి రమ్యకృష్ణ, సీనియర్‌ నటుడు కార్తీక్ ఇందులో ప్రధాన పాత్రలను పోషించనున్నారు.

2005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles