కొంద‌రు వ‌ర‌ద‌ల‌లోనే చిక్కుకొని ఉన్నారు: కార్తీ

Tue,September 25, 2018 12:39 PM
Karthi and Rakul Preet film crew caught up in heavy rains

త‌మిళ హీరో కార్తీ, అందాల భామ ర‌కుల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో దేవ్ అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ల‌క్ష్మణ్ నిర్మాణంలో డైరెక్ట‌ర్ ర‌జ‌త్ ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్ర టీం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కులుమ‌నాలిలో తాజా షెడ్యూల్ జ‌రిపేందుకు అక్క‌డికి వెళ్ళింది. అయితే అక్క‌డ కురుస్తున్న భారీ వర్షాల వ‌ల‌న చిత్రానికి సంబంధించిన యూనిట్ వ‌ర‌ద‌ల‌లో చిక్కుకున్నార‌ట. ఈ విష‌యాన్ని కార్తీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

ఒక్క‌సారిగా వ‌ర‌ద‌లు రావ‌డం వ‌ల‌న సుమారు 140 మంది చిత్ర యూనిట్ అక్క‌డ చిక్కుకున్నార‌ట‌. మంచు ప‌డుతున్న సీన్స్ కోసం అక్క‌డికి వెళ్ళిన‌ట్టు కార్తీ చెప్పాడు. అయితే హ‌ఠాత్తుగా కురిసిన భారీ వర్షం వ‌ల‌న కొంద‌రితో క‌మ్యునికేష‌న్ తెగిపోయింద‌ట‌. అయితే సోమ‌వారం రాత్రి కార్తితోపాటు మ‌రి కొంద‌రు క్షేమంగా చెన్నై చేరుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని త‌న ట్వీట్ ద్వారా తెలిపాడు కార్తీ. ద‌ర్శ‌కుడితో పాటు మ‌రి కొంద‌రు అక్క‌డే ఉన్నార‌ని, రోడ్లు కొట్టుకుపోవ‌డంతో వారు రావ‌డానికి వీలు లేకుండా ఉంద‌ని అన్నారు. ఈ రోజు సాయంత్రం వ‌ర‌కు మిగ‌తా వారు చెన్నై చేరుకునే అవ‌కాశం ఉంద‌ని కార్తీ అన్నారు. గ‌త 23 ఏళ్ళ‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఇంత భీభ‌త్సం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తుండ‌గా, హ‌ఠాత్ప‌రిణామం వ‌ల‌న చిత్రనిర్మాత‌ల‌కి కోటి రూపాయ‌ల న‌ష్టం జ‌రిగిన‌ట్టు స‌మాచారం.


1676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS