పదేళ్లు లోపలున్నానని మాత్రమే మీకు తెలుసు..ఖైదీ ట్రైలర్

Mon,October 14, 2019 03:58 PM


కార్తీ హీరోగా నటిస్తోన్న చిత్రం ఖైదీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఖైదీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో కార్తీ యావజ్జీవ శిక్ష పడిన ఖైదీగా కనిపిస్తున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. మరోవైపు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కూడా కనిపిస్తోంది.


పదేళ్లు లోపలున్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికెళ్లేముందు ఏం చేశామన్నది తెలియదు కదా సార్ అంటూ కార్తీ ఓ పోలీసాఫీసర్ తో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సామ్ సీఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఖైదీ చిత్రంలో హీరోయిన్, పాటలు లేవని టాక్. దీపావళి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.

1658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles