న‌య‌న‌తార 'క‌ర్త‌వ్యం' ట్రైల‌ర్

Tue,March 13, 2018 09:39 AM
Karthavyam Official Trailer released

లేడి సూపర్ స్టార్ నయనతార తమిళ చిత్రం తెలుగులో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. మింజుర్ గోపీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అరం అనే త‌మిళ చిత్రం తెలుగులో క‌ర్త‌వ్యం పేరుతో మార్చి 16న విడుద‌ల కాబోతుంది. మెసేజ్ ఓరియెంటెడ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రంలో న‌య‌న‌తార క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌నుంది. నీటి కోసం తల్లాడే రైతుల వెన్నంటే నిలిచి వారి కష్ట నష్టాలలో భాగస్వామి గా నిలిచే కలెక్టర్ పాత్రలో న‌య‌న ఒదిగింద‌నే చెప్ప‌వ‌చ్చు . ఈ మూవీని నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తుంది . కాకాముట్టై ఫేం రమేష్ మరియు విఘ్నేష్, సును లక్ష్మీ, రామచంద్రన్ దురైరాజ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుదల చేశారు మేకర్స్ . ఇది తెలుగు అభిమానులలోను సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించగా, ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles