నయనతార 'కర్తవ్యం' టీజర్ వచ్చేసింది

Thu,March 8, 2018 04:21 PM
Karthavyam Official Teaser

లేడి సూపర్ స్టార్ నయనతార తమిళంలో మింజుర్ గోపి దర్శకత్వంలో అరం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కంప్లీట్ మెసేజ్ ఓరియెంటెడ్ నేపథ్యంలో తెరకెక్కింది. నీటి కోసం తల్లాడే రైతుల వెన్నంటే నిలిచి వారి కష్ట నష్టాలలో భాగస్వామి గా నిలిచే కలెక్టర్ పాత్ర పోషించింది నయనతార. ఈ మూవీని నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ తెలుగులో కర్తవ్యం పేరుతో మార్చి 16న విడుదల చేస్తుంది . కాకాముట్టై ఫేం రమేష్ మరియు విఘ్నేష్, సును లక్ష్మీ, రామచంద్రన్ దురైరాజ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్ . ఇది తెలుగు అభిమానులలోను సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించగా, ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన చిత్ర టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

2197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles