భ‌న్సాలీ తల్లిపై సినిమా చేస్తున్నామంటున్న క‌ర్ణిసేన‌

Fri,January 26, 2018 12:54 PM
karnisena announcement of leela project

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ ప‌ద్మావ‌తి. జ‌న‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ పొందింది. ప‌లు వివాదాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమాని నిలిపివేయాల‌ని ఇప్ప‌టికీ ఆందోళ‌న‌లు చేస్తున్నారు క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌లు. పోలీసుల సెక్యూరిటీతో కొన్ని చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికి, రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గోవా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో తొలిరోజు ‘పద్మావత్‌’ విడుదల నిలిచిపోయింది. అయితే తాజాగా చిత్తోర్‌గఢ్‌ జిల్లా కర్ణి సేన అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ కంగరౌత్‌ గురువారం మీడియా సమావేశం నిర్వహించి తాము సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌ల్లి ‘లీలా భన్సాలీ’పై సినిమా చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. భ‌న్సాలీ.. ప‌ద్మావ‌త్ మూవీతో మా త‌ల్లి రాణి ప‌ద్మావ‌తిని అవ‌మానించారు. కాని మేం చేయ‌బోవు సినిమా చూసి సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఖ‌చ్చితంగా గ‌ర్వ‌ప‌డ‌తార‌ని ఆయ‌న అన్నారు. ఈ మూవీకి ‘‘లీలా కి లీలా’’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన క‌ర్ణిసేన‌ అరవింద్ వ్యాస్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీని తెర‌కెక్కించ‌నున‌న్న‌ట్టు ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెల‌లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంద‌ని గోవింద్ సింగ్ అన్నారు. ‘దేశంలో ప్రతీ పౌరుడికి స్వేచ్ఛా హక్కు ఉంటుంది అనే అంశాన్ని ప‌ట్టుకొని పద్మావత్‌ను భన్సాలీ తెరెక్కించారు. సరిగ్గా అదే హక్కును ఉప​యోగించుకుని అంతకంటే భేషుగ్గా.. మేం పచ్చి నిజాలను చూపిస్తాం’ అని కర్ణిసేన ప్రకటించింది .

2131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles