ఆ సాంగ్‌కి డ్యాన్స్ వేసినందుకు స్కూల్ ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం చేసిన క‌ర్ణిసేన‌

Tue,January 16, 2018 01:45 PM
Karni Sena Vandalize A School furniture

సంజ‌య్ లీలా క్రేజీ ప్రాజెక్ట్ ప‌ద్మావ‌తి చిత్రం డిసెంబ‌ర్ 1న విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా, వివాదాల నేప‌థ్యంలో ప‌లు మార్పుల‌తో జ‌న‌వ‌రి 25న రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ప‌ద్మావ‌త్ టైటిల్‌తో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే కొన్ని రోజుల క్రితం చిత్రానికి సంబంధించి తొలి వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బన్సాలీ కంపోజ్ చేసిన గూమర్ సాంగ్‌ను శ్రేయా ఘోషల్, స్వ‌రూప్ ఖాన్ పాడారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ కోటలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకి మంచి క్రేజ్ ల‌భించ‌గా, ప‌లు పెళ్లి వేడుకలు, ఇతర ఫంక్షన్స్‌లో మార్మోగిపోతుంది. ఆ మ‌ధ్య సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ కూడా ఈ పాటకి చక్కటి డ్యాన్స్ చేశారు. కాని ఈ పాట కూడా వివాదంలో చిక్కుకోవ‌డంతో సినిమా నుండి సాంగ్‌ని తీసేస్తారా అనే అనుమానం అభిమానుల‌లో క‌లుగుతుంది.

మంచి అప్లాజ్ అందుకున్న గూమ‌ర్ సాంగ్ పాట‌కి మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని ర‌ట్లంలో ఉన్న‌ సెయింట్ పాల్స్ కాన్వెంట్ స్కూల్‌కి చెందిన విద్యార్ధులు యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా స్టెప్స్ వేశారు. దీనిపై మండి ప‌డ్డ క‌ర్ణిసేన‌కి చెందిన కొంద‌రు ఆందోళ‌న‌కారులు స్కూల్ ఫ‌ర్నీచ‌ర్‌తో పాటు ప్రాప‌ర్టీ మొత్తాన్ని ధ్వంసం చేసిన‌ట్టుగా తెలుస్తుంది. చైర్స్ విసిరేయ‌డం, వ‌స్తువుల‌ని విర‌గొట్టే క్ర‌మంలో ఓ విద్యార్ధికి గాయాలు అయిన‌ట్టు కూడా తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. ప‌ద్మావ‌త్‌ చిత్రంలో షాహిద్ కపూర్ రావ‌ల్ ర‌త‌న్ సింగ్ అనే పాత్ర‌ని పోషించ‌గా, ర‌ణ‌వీర్ సింగ్ అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్ర‌లో, దీపిక ప‌దుకొణే చిత్తోర్‌గ‌ఢ్‌ యువ‌రాణి, రాణి ప‌ద్మావ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగతి తెలిసిందే.


2235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles