జీరోలో క‌త్రినా.. వైర‌ల్‌గా మారిన ఫ‌స్ట్ లుక్

Tue,July 17, 2018 09:12 AM
karina new look goes viral

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం జీరో. 2018 డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ప్రయోగాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై అభిమానులలో మంచి జోష్ తెచ్చింది. చిత్రంలో అనుష్క‌ శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటించ‌గా, షారూఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రంలో సూపర్ స్టార్ పాత్ర పోషిస్తున్నారు కత్రినా. ఆమె ప్రేమను గెలుచుకోవాలని షారుక్ ప్రయత్నిస్తుంటారు. మరోపక్క అనుష్క మానసిక దివ్యాంగురాలి పాత్రలో క‌నిపించనున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీపై ఆస‌క్తి క‌లిపించేందుకు చిత్ర యూనిట్ వినూత్నంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంది. తాజాగా క‌త్రినా కైఫ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. క‌ళ్ళ‌కు మందంగా కాటుక‌పెట్టి డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తుంది క‌త్రినా. ఈ అమ్మ‌డి పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. జీరో చిత్రానికి అజయ్‌-అతుల్ సంగీతం అందించ‌గా, షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, ఆనంద్ ఎల్ రాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, కాజోల్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

1778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles