పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన క‌రీనా క‌పూర్!

Tue,January 22, 2019 08:11 AM
kareena kapoor gives clarity on her political entry

బాలీవుడ్ బెబో క‌రీనా క‌పూర్ ఇప్ప‌టికి త‌న అందంతో కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. భోపాల్ రాజ వంశస్తుడైన మన్సూర్ అలీఖాన్ వారసుడు సైఫ్ అలీఖాన్‌ని 2012లో వివాహ‌మాడిన ఈ అమ్మడు 2016లో తైమూర్ అలీఖాన్‌కి జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న కరీనా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో దిగుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిని క‌రీనా కొట్టి పారేసింది. ఎన్నిక‌ల్లో నేను పోటీ చేస్తున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. ఏ పార్టీవారు న‌న్ను సంప్ర‌దించ‌లేదు. ప్ర‌స్తుతం నా దృష్టంతా సినిమాల‌పైనే ఉంది అని క‌రీనా వెల్ల‌డించింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కరీనా మామ (సైఫ్ అలీఖాన్ తండ్రి), మాజీ క్రికెటర్ టైగర్ పటౌడీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.

977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles