ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఖాన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరీనాకపూర్ భోపాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారంటూ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఈ వార్తలను కరీనాకపూర్ తోసిపుచ్చింది. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని కరీనా చెప్పింది. ఈ విషయంపై తనను నన్ను ఎవరూ సంప్రదించలేదని..ప్రస్తుతం తన దృష్టి అంతా కేవలం సినిమాల మీదే అని కరీనా ఓ ప్రకటనలో వెల్లడించింది. గతంలో బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కూడా లోక్ సభ స్థానంలో పోటీ చేస్తున్నారని వార్తలు రాగా..వాటిని మాధురీ తోసిపుచ్చిన సంగతి విదితమే.