సైఫ్ కూతురు సారా పై క‌రీనా కామెంట్స్

Sun,July 16, 2017 03:01 PM
Kareena kapoor comments on Sara Ali khan

త‌న భ‌ర్త సైఫ్ కూతురు సారా పై క‌రీనా కపూర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ఇండ‌స్ట్రీలో సారా అలీ ఖాన్ త‌ప్ప‌కుండా నిల‌దొక్కుకుంటుంద‌ని తెలిపింది క‌రీనా. సారా డెబ్యూ మూవీ కేదార్ నాథ్ గురించి మాట్లాడిన క‌రీనా.. తన జీన్స్ లోనే న‌ట‌న ఉంద‌ని... త‌న అందం, టాలెంట్ తో ఇండ‌స్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా ఎదుగుతుంద‌ని చెప్పుకొచ్చింది క‌రీనా. 1991 లో అమృత సింగ్ ను పెళ్లి చేసుకున్న సైఫ్.. 2004 లో అమృత తో డైవర్స్ తీసుకున్నాడు. వీళ్ల‌కు సారా(23), ఇబ్ర‌హీం (19) అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. త‌ర్వాత 2012 లో సైఫ్ అలీ ఖాన్.. క‌రీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల‌కు 2016 లో తైమూర్ జన్మించాడు. ఇక‌.. సారా కొత్త మూవీ కేదార్ నాథ్ వ‌చ్చే సంవ‌త్స‌రం రిలీజ్ అవ‌నుంది. ప్ర‌స్తుతానికి న్యూయార్క్ లో ఉన్న సారా... ఐఫా వేడుక‌ల్లో సైఫ్, సోద‌రుడితో సంద‌డి చేసింది. అభిషేక్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కేదార్ నాథ్ మూవీలో హీరోగా సుషాంత్ సింగ్ రాజ్ పుత్ న‌టిస్తున్నాడు.

4010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS