తైమూర్‌తో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సైఫీనా.. వైరల్ ఫోటోలు

Mon,February 18, 2019 03:28 PM
Kareena Kapoor And Taimur photos with Saif Ali Khan win the hearts of netizens

సినిమా సెలబ్రిటీలకు కాస్త సమయం దొరికితే చాలు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో టూర్లకు చెక్కేస్తుంటారు. కొన్ని రోజులు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతారు. సెలవులను ఎంజాయ్ చేస్తారు. తర్వాత మళ్లీ వర్క్ మూడ్‌లోకి వస్తుంటారు. సినిమా షూటింగ్ సమయంలో ఉండే ఒత్తిడి, టెన్షన్‌ను ఇలా టూర్లకు వెళ్లి తగ్గించుకుంటారు వాళ్లు. ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్లే వాళ్లలో కరీనా ఫ్యామిలీ ముందుంటుంది.

తాజాగా వాళ్లు ఎంజాయ్ మూడ్‌లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, తైమూర్ ఖాన్.. ముగ్గురు కలిసి తమ పెట్ డాగ్‌తో ఉన్న ఫోటో వైరల్‌గా మారింది. పొద్దున్నే అందరూ ఒకే కలర్ స్వెటర్ వేసుకొని పెట్ డాగ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటో అది. అది బహుషా పటౌడీ ప్యాలెస్ అయి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాంతో పాటు వాళ్ల ఫ్యామిలీకి చెందిన మరికొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్‌గా మారాయి.


సైఫ్, కరీనా జంట 2012లో పెళ్లి చేసుకున్నది. 2016లో వాళ్లకు తైమూర్ పుట్టాడు. తైమూర్ ఫస్ట్ బర్త్‌డే వేడుకలను సైఫీనా.. పటౌడీ ప్యాలెస్‌లోనే నిర్వహించారు. కొన్ని రోజుల పాటు నిర్వహించిన తైమూర్ బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.
View this post on Instagram

#familygoals👪

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


వాళ్ల సినిమాల గురించి మాట్లాడుకుంటే... కరీనా కపూర్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో గుడ్ న్యూస్ అనే సినిమా వస్తోంది. ఆ సినిమా షూటింగ్ సెట్‌కు ఓసారి తైమూర్‌ను కూడా కరీనా తీసుకెళ్లింది. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం సాక్రెడ్ గేమ్స్ సీజన్ టూ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.
View this post on Instagram

#taimursfirstbirthday💙💙💙#birthdayfun🎉 📸 @thehouseofpixels

A post shared by KK (@therealkarismakapoor) on

1731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles