సైఫ్‌, క‌రీనా వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్‌

Thu,October 17, 2019 10:22 AM

బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో సైఫ్ అలీ ఖాన్, కరీనా క‌పూర్ ఒక‌రు. సైఫ్.. కరీనాని అక్టోబ‌ర్ 16, 2012లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి డిసెంబ‌ర్ 20, 2016లో తైమూర్ పుట్టాడు. సైఫ్‌కు గ‌తంలో అమృతతో వివాహం జ‌ర‌గ‌గా, కొన్నాళ్ల త‌ర్వాత‌ విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే బుధ‌వారంతో సైఫ్‌, క‌రీనాల వివాహం జ‌రిగి ఏడు సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌డంతో వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుపుకున్నారు. క‌రీనా సోద‌రి క‌రీష్మా కపూర్ వారిద్ద‌రితో కేక్ క‌ట్ చేయించింది. ముంబైలో ఈ వేడుక జ‌ర‌గ‌గా, యానివ‌ర్స‌రీకి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా క‌రీనా కూడా అప్ప‌ట్లో సహ నటుడు షాహిద్ కపూర్ తో చాలా కాలం డేటింగ్‌లో ఉంది . మనస్పర్ధలు రావడంతో వీరు విడిపోయారు. కొన్నాళ్ల‌ తర్వాత కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌‌తో బంధం ఏర్పడింది. ప్ర‌స్తుతం వీరి వివాహ బంధం అన్యోన్యంగా సాగుతుంది.క‌రీనా క‌పూర్, సైఫ్ అలీఖాన్ జంట‌గా లాక్ కార్గిల్‌, త‌షాన్, ఓంకార‌, కుర్భాన్ అండ్ ఏజెంట్ వినోద్ చిత్రాల‌లో క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం క‌రీనా గుడ్ న్యూస్ అనే చిత్రంలో న‌టిస్తుంది. అక్ష‌య్ కుమార్, కియారా అద్వానీ, దిల్జిత్ దోసంగ్ చిత్రంలో ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. అంగ్రేజ్ మీడియంలో ఇర్ఫాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టిస్తున్న క‌రీనా .. క‌ర‌ణ్ జోహార్ పీరియ‌డ్ డ్రామా త‌క్త్‌లోను న‌టిస్తుంది. ఇక సైఫ్ న‌టించిన లాల్ క‌ప్తాన్ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. స్కేర్డ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ సెకండ్ సీజ‌న్‌లోను సైఫ్ న‌టిస్తున్నాడు. జ‌వానీ జానేమన్, దిల్ బెహ్రా, తానాజీ: ది అన్‌సంగ్ వారియ‌ర్, బూత్ పోలీస్ వంటి చిత్రాల‌లోను సైఫ్ న‌టించ‌నున్నాడు.
View this post on Instagram

#anniversary #fulloflove ❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

View this post on Instagram

Love ❤❤❤❤ #anniversary

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

1565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles