మాస్కోలో సినీ నటుడి నిర్బంధం

Wed,January 30, 2019 05:12 PM
Karanvir Bohra stuck in Moscow later indian embassy responds

ముంబై: సినీ నటుడు కరన్‌వీర్ బొహ్రాను మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అధికారులు నిలిపివేశారు. పాస్‌పోర్టు సంబంధిత కారణాలతో ఎయిర్‌పోర్టు అధికారులు కరన్‌వీర్ బొహ్రాను ఎయిర్‌పోర్టులో ఆపేశారు. ఈ విషయమై అధికారులు రష్యాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

‘నా పాస్‌పోర్టు స్వల్పంగా దెబ్బతిన్నది. అధికారులు నన్ను భారత్‌కు పంపించేందుకు ఆలోచిస్తున్నారు. మీరు ఎవరైనా నా సమస్యపై స్పందించి..నాకు వీసా ఇప్పించేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నా’..అంటూ కరన్‌వీర్ బోహ్రా ట్వీట్ చేశాడు. కరన్‌వీర్ ట్వీట్‌కు రష్యాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ‘భారత రాయబార కార్యాలయ అధికారులు రష్యన్ అధికారులతో టచ్‌లో ఉన్నారు. ఈ సమస్యపై చర్చిస్తున్నారని’ రీట్వీట్ చేసింది. తన విజ్ఞప్తికి స్పందించిన అధికారులకు కరన్‌వీర్ ధన్యవాదాలు తెలియజేశాడు. కరన్‌వీర్ బొహ్రా మాక్‌కాఫీ బాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరన్ వీర్ బొహ్రా లవ్ యూ సోనియే, ముంబై 125 కేఎం, పటేల్ కీ పంజాబీ షాదీ చిత్రాల్లో నటించాడు. టెలివిజన్ సిరీస్ సీఐడీ తోపాటు హిట్ సీరియల్స్ లో నటించాడు. కరన్ వీర్ బిగ్ బాస్ 12వ సీజన్ లో కంటెస్టంట్ కూడా.

3323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles