త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రీ లుక్ విడుద‌ల చేసిన క‌ర‌ణ్ జోహార్

Thu,March 7, 2019 11:25 AM
Karan Johar Shares kalank Film Origin

ప‌దిహేనేళ్ళ క‌ల‌కి తొలి అడుగు ప‌డింద‌ని అంటున్నాడు బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్. ప్ర‌స్తుతం త‌న నిర్మాణంలో అలియా భ‌ట్‌, మాధురి దీక్షిత్‌, వ‌రుణ్ ధావ‌న్, ఆదిత్య రాయ్ క‌పూర్, సోనాక్షి సిన్హా, సంజ‌య్ ద‌త్, కునాల్ కెమ్ము ప్ర‌ధాన పాత్ర‌లుగా క‌ళంక్ అనే మ‌ల్టీ స్టార్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు క‌ర‌ణ్‌. భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. ఏప్రిల్ 19న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నట్టు మేక‌ర్స్ ప్ర‌కటించారు. తాజాగా చిత్ర ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ఓ యువ‌తి నావ‌లో కూర్చొని ప్ర‌యాణిస్తుండ‌గా, ఆమె వెనుక న‌డిపే వ్య‌క్తి ఉన్నాడు. ప్రీ లుక్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

క‌ళంక్ చిత్ర ప్రీ లుక్ విడుద‌ల చేసిన క‌ర‌ణ్ జోహార్ ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి యశ్‌ జోహార్‌ను గుర్తుచేసుకున్నారు. ప‌దిహేనేళ్ళ క్రితం నా హృద‌యంలో పుట్టిన చిత్ర‌మిది. ఈ చిత్రాన్ని నేను స్పూర్తిగా తీసుకుంటాను. నా తండ్రి చనిపోక‌ముందు చివ‌రిగా ఈ చిత్రానికి ప‌నిచేశారు. ఆయ‌న ఉన్న‌ప్పుడు క‌ల‌ని నెరవేర్చ‌లేక‌పోయాను. కాని ఈ రోజున ఆయ‌న ఆశ‌ని నెర‌వేర్చేందుకు తొలి అడుగు వేసాను. క‌ల్లోలభ‌రిత సంబంధాలు మ‌రియు శాశ్వ‌త‌మైన ప్రేమ‌క‌థ‌కి వాయిస్ దొరికింది. ఈ చిత్రాన్ని అభిషేక్ వ‌ర్మ హృద్యంగా తెర‌కెక్కిస్తున్నారు. 1940 కాలానికి చెందిన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రం రూపొంద‌నుండ‌గా, ఈ రోజు నుండి సినిమా ప్ర‌యాణం మొద‌లు కాబోతుంది. ఈ అమ‌ర ప్రేమ‌క‌థ‌లో మీరు భాగ‌స్వాములు అవుతార‌ని ఆశిస్తున్నాను. అని క‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు.

2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles