500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీదేవి కూతురు

Thu,August 9, 2018 03:46 PM
Karan Johar ropes Takht

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇటీవల ధడక్ అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు జాన్వీకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక జాన్వీ తర్వాత సినిమా ఎవరితో చేస్తుందా అని అందరు ఆలోచనలు చేస్తుండగా, బడా ఆఫర్ ఈ అమ్మడిని వరించింది. కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్ కి ఛాన్స్ దక్కింది. తక్త్ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన సరసన కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుంది.

తక్త్ అనే టైటిల్ ని బట్టి చూస్తుంటే ఇదేదో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అని అర్ధమవుతుంది. తక్త్ అంటే బెంచ్ లేదా సీట్ అని అర్ధం. సింహాసనం కోసం పోరాడే వారియర్ సినిమాగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుండగా ఇందులో అలియా భట్ తో పాటు విక్కీ కౌశల్, అనీల్ కపూర్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విక్కీ కౌశల్ కి జతగా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారేమోనని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉన్నా కూడా టైటిల్ తో పాటు తారాగణం చూస్తుంటే ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

3154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles