వివాహవేడుక వివరాలు చెప్పిన కమెడియన్

Mon,October 22, 2018 06:48 PM
kapilsharma told about his wedding Details

ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్ కపిల్‌శర్మ తన స్నేహితురాలు గిన్నీ ఛత్రాత్‌ను వివాహం చేసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కపిల్ శర్మ తన పెండ్లి వేడుక ఎప్పుడనే విషయాన్ని చెప్పాడు. డిసెంబర్ 12 గిన్నీ ఛత్రాత్ స్వస్థలమైన జలంధర్ (పంజాబ్)లో తన వివాహవేడుక జరుగనుందని కపిల్ తెలిపాడు. అనంతరం డిసెంబర్ 14న ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు చెప్పాడు.

‘నా పెండ్లి వేడుక నిరాడంబరంగా చేయాలనుకున్నా. కానీ గిన్నీ ఛత్రాత్ కుటుంబసభ్యులు అత్యంత గ్రాండ్‌గా పెండ్లి వేడుక జరుపాలకుంటున్నారు. గిన్నీ ఒక్కగానొక్క కూతురు కావడంతో అంగరంగవైభవంగా పెండ్లి చేయాలని వాళ్లు నిర్ణయించారు. వారి ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుని వాటిని గౌరవిస్తాను. మా అమ్మ కూడా వివావా వేడుకను వైభవోపేతంగా నిర్వహించాలని కోరుకుంటోందన్నాడు’ కపిల్‌శర్మ. తన స్నేహితురాలు గిన్నీ ఛత్రాత్‌ను కపిల్‌శర్మ గతేడాది సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

6041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles