పెళ్లిపీట‌లెక్క‌బోతున్న పాపుల‌ర్ క‌మెడీయ‌న్‌

Fri,November 16, 2018 08:31 AM
Kapil Sharma wedding date Confirmed

ఈ ఏడాది ఎంద‌రో స్టార్స్ పెళ్ళి పీట‌లెక్క‌గా, తాజాగా పాపుల‌ర్ క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ కూడా త‌న పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. కొన్నాళ్ళుగా గిన్నీ ఛ‌త్రాత్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్న క‌పిల్ శ‌ర్మ ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో.. ఆమెని వివాహం చేసుకోబోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం డిసెంబ‌ర్ 12న గిన్నీ సొంత ఊరు జ‌లంద‌ర్‌కి ద‌గ్గ‌ర‌లో ఉన్న ప‌గ్వ‌రా అనే ప్రాంతంలో వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. పెళ్ళి త‌ర్వాత రెండు రిసెప్ష‌న్‌ల‌ని ఏర్పాటు చేయ‌గా, కుటుంబ స‌భ్యుల కోసం డిసెంబ‌ర్ 14న అమృత‌స‌ర్‌లో ఒక రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. రెండోది డిసెంబ‌ర్ 24న ముంబైలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ వేడుక‌కి సినిమా ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప్ర‌ముఖులు, స్నేహితులు హాజ‌రు కానున్నారు. డిసెంబ‌ర్ 10 నుండి క‌పిల్ శ‌ర్మ పెళ్లి వేడుక‌లు ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. కామెడీనైట్స్ విత్ క‌పిల్ కార్య‌క్ర‌మంతో ఫుల్ పాపులారిటీ పొందిన న‌టుడు క‌పిల్ శ‌ర్మ ఇటీవ‌ల నిర్మాత‌గా ఓ చిత్రాన్ని నిర్మించాడు. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే చిత్రానికి క‌పిల్ స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించగా ఈ మూవీ అక్టోబర్ 12న విడుదలై మంచి విజ‌యం సాధించింది.

4760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS