పాపులర్ కమెడీయ‌న్ వెడ్డింగ్ పిక్ విడుద‌ల‌

Thu,December 13, 2018 10:40 AM
Kapil Sharma Marries Ginni Chatrath

బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం పెళ్లిళ్ళ సీజ‌న్ న‌డుస్తుండ‌గా, పాపుల‌ర్ క‌మెడీయ‌న్ కం యాక్ట‌ర్ క‌పిల్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కి ఓ ఇంటివాడ‌య్యాడు. త‌న గార్ల్ ఫ్రెండ్ ని గిన్నీ ఛ‌త్రాత్ ని జ‌లంద‌ర్‌కి ద‌గ్గ‌ర‌లో ఉన్న ప‌గ్వ‌రా అనే ప్రాంతంలో వివాహం చేసుకున్నాడు . వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. రెడ్ క‌ల‌ర్ లెహంగాలో పెళ్లి కూతురు మెరిసిపోగా, క‌పిల్ థ్రెడ్ వ‌ర్క్‌తో ఉన్న‌ గ్రీన్ షెర్వాణీ ధ‌రించాడు. క‌పిల్ సన్నిహితులు సుమోనా చ‌క్ర‌వ‌ర్తి, , కృష్ణ అభిషేక్, రాజీవ్ ఠాకూర్‌, భ‌ర్తీ సింగ్‌, హ‌రీష్ లింబాచియా త‌దిత‌రులు పెళ్లిలో సంద‌డి చేశారు. ఈ వారం మొద‌ట్లోనే క‌పిల్ పెళ్ళి హంగామా మొద‌లు కాగా, మాటా కీ చౌకీ, మెహందీ, భార‌త్ వంటి కార్య‌క్ర‌మాల‌ని ఘ‌నంగా నిర్వ‌హించారు. క‌పిల్ త‌న పెళ్ళిని ‘కపిల్‌ శర్మా కీ షాదీ హై!! పూరే ఇండియా కో ఆనా హై’ పేరుతో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాడు. పెళ్ళి కోసం పంజాబ్ వెళ్ల‌కుండా ఇంట్లో కూర్చునే త‌న పెళ్లిని వీక్షించే ఏర్పాట్లు క‌పిల్ చేశాడు. కుటుంబ స‌భ్యుల కోసం డిసెంబ‌ర్ 14న అమృత‌స‌ర్‌లో ఒక రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది . రెండోది డిసెంబ‌ర్ 24న ముంబైలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ వేడుక‌కి సినిమా ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప్ర‌ముఖులు, స్నేహితులు హాజ‌రు కానున్నారు. క‌పిల్ కొత్త షో ‘ది కపిల్ శర్మ షో’ పేరుతో ఇటీవ‌లే మొద‌లైన సంగ‌తి తెలిసిందే.

View this post on Instagram

🙏

A post shared by Kapil Sharma (@kapilsharma) on

2327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles