‘ఫిరంగి’ విడుదల వాయిదా వేసిన కపిల్ శర్మ..

Wed,November 22, 2017 07:05 PM
‘ఫిరంగి’ విడుదల వాయిదా వేసిన కపిల్ శర్మ..


ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్ కపిల్‌శర్మ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఫిరంగి’. ఈ మూవీ రిలీజ్‌ను డిసెంబర్ 1కి వాయిదా వేశారు. ఫిరంగి సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) నుంచి ఎలాంటి సర్టిఫికెట్ రాకపోవడంతో విడుదలను డిసెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు కపిల్‌శర్మ. ఫిరంగి మూవీని కపిల్ శర్మ నిర్మిస్తున్నాడు. సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కిన పద్మావతి మూవీ డిసెంబర్ 1న రావాల్సి ఉండగా..దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు ఫిరంగి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.

894

More News

VIRAL NEWS