యూట్యూబ్‌లో లైవ్‌లీగా పెళ్ళిని వీక్షించే ఛాన్స్

Sun,December 9, 2018 08:09 AM
Kapil Ki Shaadi Hai Poore India Ko Aana Hai video

సెల‌బ్రిటీల పెళ్ళిళ్ళ‌కి వెళ్ళాల‌ని , అక్క‌డ జ‌రిగే హంగామాని క‌నులారా చూడాలని ఎంద‌రో అభిమానులు క‌ల‌లు కంటుంటారు. కాని వారి క‌ల‌లు అలానే ఉండిపోతాయి. అయితే పాపుల‌ర్ క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ త‌న పెళ్ళికి సంబంధించిన హంగామాని లైవ్‌లో వీక్షించే ఛాన్స్ త‌న అభిమానుల‌కి క‌ల్పించాడు. కపిల్‌ తన అభిమానుల కోసం యూట్యూబ్‌ చానల్‌లో పెళ్లి వేడుకను లైవ్‌స్ట్రీమింగ్‌ చేయనున్నాడు. పెళ్లి కంటే ఒకరోజు ముందుగానే అంటే డిసెంబరు 11 నుంచే లైవ్‌స్ట్రీమింగ్‌ మొదలుకానుంది. ‘కపిల్‌ శర్మా కీ షాదీ హై!! పూరే ఇండియా కో ఆనా హై’ (కపిల్‌ శర్మ పెళ్లికి భారత్‌ మొత్తం రావాలి)పేరిట ‘కపిల్‌ పెళ్లి పిలుపు’లకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక‌ కపిల్‌ పెళ్లి కోసం పంజాబ్‌కు వెళ్లాల్సిన పని లేకుండానే హాయిగా ఉన్న చోటే పెళ్ళిని వీక్షించండి.

డిసెంబ‌ర్ 12న త‌న‌కి కాబోయే స‌తీమ‌ణి గిన్నీ ఛ‌త్రాత్‌ సొంత ఊరు జ‌లంద‌ర్‌కి ద‌గ్గ‌ర‌లో ఉన్న ప‌గ్వ‌రా అనే ప్రాంతంలో వివాహం చేసుకోనున్నాడు క‌పిల్‌. పెళ్ళి త‌ర్వాత రెండు రిసెప్ష‌న్‌ల‌ని ఏర్పాటు చేయ‌గా, కుటుంబ స‌భ్యుల కోసం డిసెంబ‌ర్ 14న అమృత‌స‌ర్‌లో ఒక రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. రెండోది డిసెంబ‌ర్ 24న ముంబైలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ వేడుక‌కి సినిమా ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప్ర‌ముఖులు, స్నేహితులు హాజ‌రు కానున్నారు. డిసెంబ‌ర్ 10 నుండి క‌పిల్ శ‌ర్మ పెళ్లి వేడుక‌లు ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. క‌పిల్ కొత్త షో ‘ది కపిల్ శర్మ షో’ పేరుతో ఇటీవ‌లే మొద‌లైన సంగ‌తి తెలిసిందే.

2880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles