క‌పిల్ దేవ్ బ‌యోపిక్ విడుద‌ల‌కి టైం ఫిక్స్

Fri,July 6, 2018 11:07 AM
kapil biopic release date fixed

యన్ టీమ్ లెజెండరీ ప్లేయర్, వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్‌దేవ్‌ బయోపిక్ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న విషయం విదితమే. 1983 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీని కబీర్‌ఖాన్ డైరెక్ట్ చేస్తున్నాడు . 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా మూవీ తెరకెక్క‌నుంది . గ‌త ఏడాది సెప్టెంబర్ లో లాంచ్ అయిన ఈ చిత్రం 2019, ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అప్ప‌ట్లో స్పష్టం చేశారు. కాని ఈ మూవీ రిలీజ్ కాస్త ముందుకు జ‌రిగింది. 2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు . హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ‘ఎన్టీఆర్ బయోపిక్’ నిర్మాత విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. అయితే ఏప్రిల్ 10,2020న విన్‌డీసెల్ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 9 కూడా విడుద‌ల కావ‌డంతో రెండు సినిమాల మ‌ధ్య భారీ పోటీ నెల‌కొండ‌నుంది.


1025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles