'అసలేం జరిగింది'లో సంచితా పదుకునే

Sat,February 23, 2019 07:18 PM
Kannada actress sanchita padukone in sriram asalem jarigindi telugu movie

రోజా పూలు, ఒకరికి ఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటి విజయవంతమైన చిత్రాలతో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్ కొంత విరామం తరువాత తెలుగులో నటిస్తున్న చిత్రం 'అసలేం జరిగింది'. ఈ చిత్రంలో శ్రీరామ్ సరసన కన్నడ భామ సంచితా పదుకునే నాయికగా నటిస్తోంది.

ఎక్సోడస్ మీడియా పతాకంపై నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను సమకూర్చారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ తెలియజేస్తూ.. 'గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఒక సస్పెన్స్ లవ్‌ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హీరో శ్రీరామ్, సంచితా పదుకునే జంట చక్కగా కుదిరింది. అందం, అభినయం కలగలిసిన అచ్చ తెలుగు అమ్మాయిలా సంచితా పదుకునే ఈ చిత్రంలో కనిపిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాం. మే చివరిలోపు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

2508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles