కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కంగనా సందడి.!

Tue,April 24, 2018 05:49 PM
Kangana Ranaut will be walking at the Cannes red carpet for the first time

అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్ కేన్స్ లో బాలీవుడ్ క్వీన్ సందడి చేయనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తొలి సారి ఈ ఫెస్టివల్ కి కంగనా హాజరు కానుండగా, ఈమె కేన్స్ ప్రచారకర్తగా కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇప్పటివరకు ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, సోనమ్ కపూర్, మల్లికా శెరావత్, శ్రుతి హాసన్ తదితరులు పాల్గొని హోయలు పోయారు. ఈ సారి కంగనా వెళ్ళనుందనే వార్త బయటకి వచ్చే సరికి ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత నేపథ్యంలో మణికర్ణిక అనే చిత్రం చేసింది కంగనా. ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అందాల తారలు రెడ్ కార్పెట్ పై హోయలు పోతూ సెల్ఫీలకి స్టిల్స్ ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. కాని ఇక నుండి ఆ ఛాన్స్ ఉండదు. ప్రదర్శనకి వెళ్ళే సమయంలో సెల్ఫీలు దిగుతుండడం వలన కొందరికి అసౌకర్యంగా ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అందువలన సెల్ఫీలని నిషేదించారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం ప్రీమియర్స్ గౌరవాన్ని తప్పక కాపాడతాయని కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రీమాక్స్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.

1600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles