బాలీవుడ్ భామ క‌త్తి సాము చూశారా.. వీడియో

Thu,October 12, 2017 04:42 PM
Kangana Ranaut undergoes intense sword fighting training sessionఒక‌ప్పుడు త‌మ గ్లామ‌ర్‌తో ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేసే అందాల భామ‌లు, ఇప్పుడు క‌త్తుల దూస్తూ అభిమానుల‌చే ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అనుష్క‌, త‌మ‌న్నా, శృతి హాస‌న్‌, హ‌న్సిక, ఆదా శ‌ర్మ‌ వంటి అందాల భామ‌లు ఇప్ప‌టికే క‌త్తి సాముపై బాగానే క‌స‌ర‌త్తులు చేయ‌గా, ఇప్పుడు బాలీవుడ్ భామ కంగనా ర‌నౌత్ తాను లీడ్ రోల్‌లో తెర‌కెక్క‌నున్న మ‌ణిక‌ర్ణిక కోసం క‌త్తి సాము ప్రాక్టీస్ చేస్తుంది. రెండు క‌త్తుల‌ను ఒకేసారి తిప్పుతూ క‌త్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న కంగనా వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హాలీవుడ్‌కి చెందిన స్టంట్ డైరెక్ట‌ర్ నిక్ పావెల్ నేతృత్వంలో కంగ‌నాతో పాటు చిత్రంలో ఇతర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న సోనూ సూద్‌, అంకిత లోఖాండే, వైభ‌వ్ త‌త్వావాడిలు కూడా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27, 2018న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ య‌త్నిస్తోంది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెర‌కెక్క‌నున్న చిత్రం 'మణికర్ణికకి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ సినిమాకు బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి గాథ ఆధారంగా 'మణికర్ణిక' సినిమాను తెరకెక్కించనున్నారు. బాలీ వుడ్ నిర్మాత కమల్ జైన్ అత్యంత భారీ బడ్జెట్‌తో 'మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ`'ను నిర్మిస్తుండగా, శంకర్, ఎహసాన్, లాయ్‌లు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రసూన్ జోషి మాటలు, పాటలు రాస్తున్నారు. మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి 1828లో కాశీలో జ‌న్మించినందున‌, ఈ చిత్ర లాంచింగ్ కార్య‌క్ర‌మం కాశీలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

2116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS