ఆడై చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచ‌న‌లో కంగ‌నా..!

Wed,October 23, 2019 10:09 AM

బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్స్‌లో కంగ‌నా ర‌నౌత్ ఒక‌రు. సెల‌క్టివ్‌గా ప్రాజెక్ట్‌లు చేసుకుంటూ వ‌స్తున్న కంగనా ఇటీవ‌ల జ‌డ్జిమెంట‌ల్ హై క్యా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇక ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి జ‌యల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న త‌లైవీ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుంది. క‌ట్ చేస్తే కంగ‌నా ర‌నౌత్ త‌మిళ రీమేక్ చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.


కోలీవుడ్ బ్యూటీ అమ‌లాపాల్ న‌టించిన తాజా చిత్రం ఆడై. ఈ చిత్రం తెలుగులో ఆమె పేరుతో రిలీజ్ అయింది . చిత్ర టీజ‌ర్‌లో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా చూపించి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచారు . జూలై 19న విడుదలయిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. ర‌త్న కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అమ‌లాపాల్‌ని భిన్న షేడ్స్‌లో క‌నిపించింది. వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్ర రీమేక్ రైట్స్ ఫిలిం మేక‌ర్ విక్ర‌మ్ భ‌ట్ పొందాడ‌ట‌. హిందీ రీమేక్‌ని కూడా ఒరిజిన‌ల్ వ‌ర్షెన్ తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్‌తో రూపొందించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది .

921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles