నా బ‌యోపిక్ నేనే తీస్తా..

Thu,February 14, 2019 02:51 PM
Kangana Ranaut to direct her own biopic film

హైద‌రాబాద్: మ‌ణిక‌ర్ణిక ఫిల్మ్‌తో డైర‌క్ట‌ర్‌గా మారిన కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడో ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వెల్ల‌డించింది. త‌న జీవిత‌క‌థ ఆధారంగా తీసే సినిమాను తానే డైర‌క్ట్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. మ‌ణిక‌ర్ణిక సినిమాకు క‌థ రాసిన కేవీ విజయేంద్ర ప్ర‌సాదే.. ఆ బ‌యోపిక్‌కు కూడా స్క్రిప్టు రాస్తున్నాడ‌ని ఆమె తెలిపారు. సినిమా ఇండ‌స్ట్రీలో సాధించిన స‌క్సెస్ ఆధారంగా సినిమా ఉంటుంద‌ని, సున్నిత‌మైన అంశాల‌ను చాలా లైట‌ర్ స్ట‌యిల్‌లో ప్ర‌జెంట్ చేయ‌నున్న‌ట్లు కంగ‌నా తెలిపారు. హిమాల‌యాల నుంచి వ‌చ్చిన ఓ అమ్మాయి.. బాలీవుడ్‌లో ఎలా ఓ ప్ర‌ముఖ హీరోయిన్‌గా ఎదుగుతుంద‌న్న క‌థాంశంతో సినిమాను రూపొందించ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. గ్యాంగ్‌స్ట‌ర్‌, త‌నూ వెడ్స్ మ‌నూ, ఫ్యాష‌న్‌, క్వీన్ లాంటి సినిమాల్లో ర‌నౌత్ న‌టించారు. రెండు సార్లు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్న‌ది.

3886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles