త‌మిళం క్లాసులు తీసుకుంటాను: కంగ‌నా

Tue,March 26, 2019 08:58 AM
Kangana Ranaut taking tamil classes for jayalalitha BIOPIC

బాలీవుడ్ సంచ‌ల‌న న‌టి కంగ‌నా రనౌత్ ఇటీవ‌ల మ‌ణిక‌ర్ణిక చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ఆమె న‌టించిన పాగల్ హై క్యా రిలీజ్ కానుంది. ఈ మూవీ త‌ర్వాత కంగ‌నా బ‌యోపిక్ రూపొందుతుంది అని అంద‌రు అనుకున్నారు. కాని ఆమె జ‌య‌లలిత బయోపిక్‌లో న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. త‌న‌ జీవిత ప్రయాణానికి జయలలిత ప్రయాణానికి దగ్గరి పోలికలు ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాన‌ని కంగనా అంటుంది. జ‌య‌ల‌లిత సక్సెస్‌ స్టోరీ త‌న‌ దాని కన్నా పెద్దది అని చెబుతున్న కంగ‌నా, ఈ చిత్రంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌బోతున్న‌ట్టు పేర్కొంది. ఈ సినిమా త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. త‌మిళంలో సీన్లు అర్ధం కావాలన్నా, జ‌య‌ల‌లిత పాత్ర‌ని పూర్తిగా తెలుసుకోవాల‌న్నా త‌మిళం నేర్చుకోవ‌డం ముఖ్య‌మ‌ని భావించిన కంగ‌నా త‌మిళం నేర్చుకోవాల‌నుకుంటుంద‌ట‌. ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఈ సినిమాను ‘జయ’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. త‌మిళం త‌లైవీ అనే టైటిల్‌తో విడుద‌ల కానుంది. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం కంగ‌నా 24 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేసిన‌ట్టు టాక్.

1268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles