ప్రియాంకా చోప్రా నిశ్చితార్థం అయిందా.. నాకు తెలియదే?

Sun,July 29, 2018 06:45 PM
Kangana Ranaut reacts to news of Priyanka Chopra engagement

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. బాయ్‌ఫ్రెండ్ నిక్ జోన్స్‌ను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెడ్డింగ్ గౌన్‌ను కూడా ప్రియాంకా సెలెక్ట్ చేసుకుందని సమాచారం. లండన్‌లో ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై ఇంకా ప్రియాంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ ఇద్దరూ అక్టోబర్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

అయితే... ప్రియాంకా చోప్రా నిశ్చితార్థంపై కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించింది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న కంగనాను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ప్రియాంకా, నిక్ జోనాస్ నిశ్చితార్థం గురించి కంగనాను అడగగా.. "అవునా.. ప్రియాంకా నాకు క్లోజ్ ఫ్రెండ్. కాని తన నిశ్చితార్థం అయింది మాత్రం నాకు తెలియదు. నాకు పీసీ ఈ విషయమే చెప్పలేదు. నేను అప్‌సెట్ అయ్యా.." అంటూ తెలిపింది కంగనా.

మధుర్ బండార్కర్ తీసిన ఫ్యాషన్ సినిమాతో పీసీ, కంగనా ఫ్రెండ్స్‌గా మారారు. ఇద్దరి సినిమా కెరీర్‌ను ఫ్యాషన్ సినిమా ఓ మలుపు తిప్పింది. ప్రియాంకా మూవీ బేవాచ్ ప్రమోషన్‌లోనూ కంగనా గెస్ట్‌గా పాల్గొన్నది. క్వీన్ సినిమాకు గాను కంగానాకు బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డు వచ్చిన సందర్బంగా ప్రియాంకా, కంగనా పార్టీ కూడా చేసుకున్నారు. మరి.. ఇంత బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న వీళ్లిద్దరి మధ్య వైరం ఎప్పుడొచ్చిందా? అని సినీ అభిమానులు నెత్తి గోక్కుంటున్నారు.

4057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS