అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిగా..

Tue,March 26, 2019 05:28 PM
kangana Ranaut Now Indias highest paid actress says reports

జయలలిత జీవితకథ నేపథ్యంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళంలో ఈ బయోపిక్‌కు 'తలైవి' అనే టైటిల్ పెట్టగా..హిందీలో 'జయ'గా ఫిక్స్ చేశారు. ఇండియావ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి కంగనారనౌత్‌ను ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం ఎంపిక చేశారు నిర్మాతలు. మార్కెట్‌లో తన సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో..కంగనా ఈ చిత్రానికి ఏకంగా రూ.24 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా..నిర్మాతలు కూడా అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

కాగా..ఈ చిత్రంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిగా కంగనా రికార్డుల్లోకెక్కనుంది. ఇప్పటివరకు బాలీవుడ్ నటి దీపికా పదుకునే అత్యధికంగా రూ.13 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా..జయలలిత బయోపిక్ తో కంగనా ఈ రికార్డును బద్దలు కొట్టేసినట్లేనని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన పద్మావత్ సినిమాకు దీపికా పదుకొనే ఈ రెమ్యునరేషన్ ను అందుకుంది. ఈ సినిమాలో నటించిన షాహిద్‌కపూర్, రణ్‌వీర్ సింగ్ కంటే ఎక్కువ పారితోషికం దీపికా పదుకొనే అందుకోవడం విశేషం. తాను జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నట్లు కంగనా తన బర్త్ డే సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బాహుబలి, మణికర్ణిక చిత్రాల రచయిత విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.

3036
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles