కంగ‌నా 'మ‌ణిక‌ర్ణిక' ట్రైల‌ర్ విడుద‌ల‌

Tue,December 18, 2018 01:56 PM
Kangana Ranaut manikarnika trailer released

వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ కంగ‌నా ర‌నౌత్‌. ఆమె ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలకానుంది. భారీ బ‌డ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కాగా, కొంత ప్యాచ్ వ‌ర్క్ కంగ‌నా ద‌ర్శ‌క‌త్వం లో రూపొందింది. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో పదునైన కత్తులతో శత్రువులపై ఝాన్సీ పోరాడే తీరు ఎలా ఉంటుందో చక్కగా చూపించారు . తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో క‌ద‌నరంగంలో క‌ర‌వాలం ప‌ట్టి శ‌త్రు మూక‌ల‌ని గ‌డ‌గ‌డ‌లాడించే ధీర వ‌నితగా కంగనా అద‌ర‌గొట్టింది. ట్రైల‌ర్‌తో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు. మ‌ణికర్ణిక చిత్రానికి పోటీగా హృతిక్ సూప‌ర్ 30 కూడా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. రెండు చిత్రాల‌పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండ‌గా, ఏ మూవీ భారీ విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.

1425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles