క్రిష్ మ‌ణిక‌ర్ణిక విడుద‌ల తేదీకి ముహూర్తం ఫిక్స్..!

Sun,July 22, 2018 11:05 AM
Kangana Ranaut Manikarnika movie release date fixed

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కథతో క్రిష్ తెరకెక్కించిన‌ చిత్రం మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆమె చూపిన వీరపరాక్రమం గురించి సినిమాలో అద్భుతంగా చూపించ‌నున్నార‌ట‌. చిత్రాన్ని స్వాతంత్య్ర‌దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల చేయాలని ముందుగా భావించారు. కాని వీఎప్ఎక్స్‌కి సంబంధించిన వ‌ర్క్ పూర్తి కాక‌పోవ‌డంతో జ‌న‌వ‌రి 25న సినిమాని రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశాడు. సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది . అయితే ఈ సినిమాకి పోటీగా గోల్డ్‌, సూప‌ర్ 30 చిత్రాలు కూడా విడుద‌ల కానున్నట్టు తెలుస్తుంది. గోల్డ్ చిత్రం అక్ష‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌గా, సూపర్ 30 అనే చిత్రంలో హృతిక్ రోషన్ న‌టిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు ఒకేసారి విడుద‌లైతే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ పోటీ త‌ప్ప‌దు.


1495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles