యూఎస్‌లో బిజీబిజీగా కంగనారనౌత్..

Sun,August 28, 2016 05:49 PM
kangana ranaut in us for simran movie

ముంబై: బాలీవుడ్ ‘క్వీన్’ కంగనారనౌత్ యూఎస్‌లో బిజీబిజీగా వర్కవుట్స్ చేస్తుంది. కంగనా ప్రస్తుతం ‘సిమ్రన్’ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఓ అమ్మాయి చుట్టు తిరిగే కథతో హన్సాల్ మెహతా సిమ్రన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ గుజరాతీ ఎన్‌ఆర్‌ఐగా కనిపించనుంది. కంగనా సినిమాలో తన పాత్రకు అవసరమైన మెలకువలను యూఎస్‌లో నేర్చుకుంటోందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

సినిమా ప్రిపరేషన్‌లో భాగంగా మెహతా టీంతో యూఎస్ వెళ్లిన కంగనా రనౌత్ సెప్టెంబర్1న ముంబైకు రానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. సెప్టెంబర్ చివరి వారంలో సిమ్రన్ షూటింగ్ ప్రారంభమయే అవకాశాలున్నాయి.

1379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS