నాలుగు గెట‌ప్స్‌లో అల‌రించ‌నున్న కాంట్రవ‌ర్షియ‌ల్ బ్యూటీ

Sun,September 15, 2019 11:17 AM

కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే కంగ‌న ర‌నౌత్ తలైవీ అనే పేరుతో రూపొంద‌నున్న‌ చిత్రంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న‌ ఈ చిత్రాన్ని విజ‌య్ తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం దీపావ‌ళి త‌ర్వాత షూటింగ్ జ‌రుపుకోనున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో కంగ‌నా నాలుగు పాత్ర‌ల‌లో న‌టించ‌నుంని, దీనికి సంబంధించి హలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్‌ జోసన్‌ కాలిన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని నిర్మాత‌లు అంటున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కి రాక‌ముందు, సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి న‌టిగా రాణిస్తున్న స‌మ‌యంలో, రాజ‌కీయ అరంగేట్రం చేసిన‌ప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇలా నాలుగు గెటప్స్‌లో కంగ‌నా సంద‌డి చేయ‌నుంద‌ట . ఈ చిత్రం కోసం కంగ‌నా రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తోందని టాక్ న‌డుస్తుంది.

1657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles