ఎల‌క్ట్రిక్ గుర్రంపై కంగ‌నా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Fri,February 22, 2019 12:37 PM
Kangana Ranaut fighting the British on an electric horse video goes viral

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చారిత్రాత్మ‌క చిత్రం మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత‌ కథతో క్రిష్ కొంత భాగాన్ని తెర‌కెక్కించ‌గా, మిగ‌తా భాగాన్ని కంగ‌నా పూర్తి చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. ముఖ్యంగా కంగ‌నా న‌ట‌న‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆమె చూపిన వీరపరాక్రమం, క‌ద‌నరంగంలో క‌ర‌వాలం ప‌ట్టి శ‌త్రు మూక‌ల‌ని గ‌డ‌గ‌డ‌లాడించే ధీరత్వం అమోఘం. వీర‌ప‌రాక్రమంతో కంగ‌నా గుర్ర‌పు స్వారీ చేస్తున్న దృశ్యాల‌ని వెండితెర‌పై చూసిన అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకున్నాయి. అయితే చిత్ర షూటింగ్‌లో కంగ‌నా ఎల‌క్ట్రిక్ గుర్రంపై స్వారీ చేసిన‌ట్టు తాజాగా విడుద‌లైన వీడియో బ‌ట్టి అర్ధ‌మైంది. క‌ద‌న రంగంలో ఆమె సైనికులు, బ్రిటీష్ సైన్యం అంద‌రు నిజ‌మైన గుర్రాల‌పై స్వారీ చేయ‌గా, కంగ‌నా మాత్రం ఎలక్ట్రిక్ గుర్రంపై స్వారీ చేస్తూ, నిజ‌మైన గుర్రంపై చేసిన‌ట్టు హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌స్తుతం కంగ‌నాకి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

కంగ‌నా న‌టించిన మ‌ణిక‌ర్ణిక చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందించారు. మ‌న‌దేశంలో ఈ చిత్రం 3000కి పైగా స్క్రీన్స్‌లో విడుద‌ల అయింది.తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. కంగ‌నా త్వ‌ర‌లో త‌న బ‌యోపిక్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


3354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles