టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝూన్సీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై కంగనా స్పష్టత ఇచ్చింది.
క్రిష్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం రోజూ మాట్లాడుకుంటూ ఉంటాం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆరోజు ఎలాంటి డేట్లు ఇవ్వలేదు. ఆగస్ట్ 15న మా సినిమా ఫస్ట్‌లుక్ విడుదలయ్యాక సినిమాను 2019 రిపబ్లిక్ డేకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం. రచయితలు మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు తెరకెక్కించాలని నిర్ణయించారు. నేను కూడా అందుకు ఒప్పుకొన్నాను. అంతేకానీ మేమిద్దరం ఏ విషయంలోనూ గొడవపడలేదు' అని చెప్పింది.