బాలీవుడ్ లో కాల్ డేటా కలకలం.. పోలీసుల అదుపులో ప్రముఖులు

Wed,March 21, 2018 04:15 PM
Kangana Ranaut, Ayesha Shroff named in Call Detail Records case

రాజకీయ రంగంలో రకరకాల కుంభకోణాలు వెలుగు చూస్తుంటాయి. వాటిలో కొన్ని పొలిటీషియన్స్ చేసేవి అయితే, మరికొన్ని బడా వ్యాపారవేత్తలు చేసే ఫైనాన్షియల్ స్కామ్స్. ఇప్పుడు సినీ రంగానికి కూడా స్కాముల బెడద స్ప్రెడ్ అయింది. లేటెస్ట్ గా బాలీవుడ్ లో కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్‌) స్కాం పెను కలకలం రేపుతోంది. అడ్వొకేట్‌ రిజ్వాన్‌ సిద్ధిఖీని ముంబయిలోని థానే క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సీడీఆర్ స్కాం బట్టబయలైంది.

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖీ గతంలో తన భార్యపై ఉన్న అనుమానంతో రిజ్వాన్‌ సిద్ధిఖీని కలిసి ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి, కాల్ డేటా రికార్డులు సంపాదించాడన్న ఆరోపణలు రావడంతో ఈ స్కాం భాగోతం బయటపడింది. దాంతో పోలీసులు ఎంటరై రిజ్వాన్ ను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేశారు. ఈ ఆ విచారణలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ భార్య ఆయేషా, నటి కంగనా రనౌత్‌ పేర్లు బయటికి వచ్చాయి. వీరికి నోటీసులు కూడా వెళ్లినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ తో కంగనాకి ఉన్న పలు విభేదాల నేపథ్యంలో ఆమె హృతిక్ ఫోన్ నెంబర్ రిజ్వాన్ కి ఇచ్చి కాల్ డేటా అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై విమర్శలు రావడంతో కంగన సోదరి రంగోలి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. సరైన విచారణ జరపకుండా ఆరోపణలు చేయడం తగదని చెప్పింది. హృతిక్‌ విషయంలో కంగనకు నోటీసులు వచ్చినప్పుడు ఆధారాల కోసం వివరాలు ఇచ్చామని దానిని పట్టుకుని ఒక నటి పరువుతీయడం సబబు కాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

2363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles