స్టార్ హీరోయిన్ కి మరో సారి గాయం

Wed,November 22, 2017 02:49 PM
స్టార్ హీరోయిన్ కి మరో సారి గాయం

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఝాన్సీ లక్ష్మీబాయి కథతో మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం కంగనా కత్తి యుద్ధాలలో శిక్షణ పొందింది. నటిగా ఇదే తన చివరి సినిమా కావడంతో ఈ మూవీపై చాలా కాన్సన్ ట్రేషన్ చేస్తుంది. అయితే ఆ మధ్య తన సహచర నటుడు నిహర్ పాండేతో కత్తిసాము చేస్తున్నప్పుడు కంగనా నుదుటిపై ఉన్న ఎముకకి కత్తి గుచ్చుకుంది. దీంతో 15 కుట్లు పడ్డాయి. కొన్ని రోజుల పాటు షూటింగ్ కి దూరంగా ఉంది.

తాజాగా కంగానా మరోసారి గాయపడింది. షూటింగ్లో కాలికి గాయం కాగా, చిత్రయూనిట్ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్పడంతో మరోసారి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి కంగానా ముంబై వెళ్ళింది. జోద్ పూర్ లో చిత్రానికి సంబంధించి తర్వాతి షెడ్యూల్ మొదలు పెట్టనున్నాడు క్రిష్. 2018 ఏప్రిల్ 27న ఈ మూవీ విడుదల కానుంది. విజయేంద్ర ప్రసాద్ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కంగనా త్వరలో ఫిలిం మేకర్ గా తన సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది. క్రిష్ సినిమా పూర్తైన వెంటనే పూర్థి స్తాయి కామెడీ చిత్రాన్ని తాను తెరకెక్కించనున్నట్టు కంగనా తెలిపింది.


1553

More News

VIRAL NEWS