స‌మ్మ‌ర్‌లో ప‌ల‌క‌రించ‌నున్న కాంచ‌న 3

Wed,November 14, 2018 12:59 PM
kanchana 3 release in summer

ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన కాంచన చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపు చిత్రాల‌న్నింటిని కూడా లారెన్స్ తెరకెక్కించగా, ఇవి మంచి సక్సెస్‌నే సాధించాయి. అంతేకాక భారీగానే వసూళ్ళను రాబట్టాయి.

కాంచన చిత్రంతో నటుడిగా , దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న లారెన్స్ ఈ చిత్రాన్ని 2011లో రిలీజ్ చేసారు. ఇందులో లారెన్స్‌తో పాటు రాయ్ లక్ష్మీ, కోవై సరళ, శరత్ కుమార్‌లు ప్రత్యేక పాత్రలలో కనిపించారు. ఈ చిత్రం లారెన్స్‌కు నటుడిగా దర్శకుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ముని సిరీస్‌లో నాలుగో చిత్రం రూపొందుతుంది. కాంచ‌న 3 అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాలో లారెన్స్ స‌ర‌స‌న ఓవియా, వేదిక నటించారు. ఒక పాట మినహా ‘కాంచన3’ షూటింగ్‌ కూడా పూర్తయింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది.

2277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles